July 24, 2026
Explore
మోటకట్ల జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే

మోటకట్ల జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే

July 24, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలం మోటకట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Tags; Mega Parents’ Day at Motakatla ZP School