పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా…గురజాల మహిళ రిజర్వేషన్ అవుతుందా!
కేంద్రం తీసుకొస్తున్న తాజా బిల్లుల ద్వారా లోక్ సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు 50 శాతం మేర పెరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణలో ప్రస్తుతం 119అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి.
ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల మేరకు ఈ స్థానాలను పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు మహిళలకు ఏపీలో లోక్ సభ 13, అసెంబ్లీ స్థానాలు 87 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. పెరిగిన సీట్ల మేరకు మహిళలు, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను ఖరారు చేయనున్నారు. అయితే, ప్రభుత్వ గణాంకాల మేరకు ఏపీలో మహిళల కు కేటాయించే సీట్ల పైన ఒక స్పష్టత వచ్చింది. జనాభా లెక్కల మేరకు వీటిని ఖరారు చేసారు. అందులో భీమిలి అన్నిటి కంటే ఎక్కువ మహిళలతో తొలి స్థానంలో ఉంది. అదే విధంగా పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం (ఎస్టీ) ఉన్నాయి.
వీటితో పాటుగా జాబితాలో పెందుర్తి , గురజాల, విశాఖపట్నం నార్త్, కోవూరు, కర్నూలు, విజయ వాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్, గన్నవరం, మైలవరం , నెల్లూరు రూరల్ , తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్ఛాపురం, కడప, శ్రీకాకుళం , చింతలపూడి (ఎస్సీ), రాజమహేంద్రవరం సిటీ, ప్రత్తిపాడు (ఎస్సీ), రాజమహేంద్రవరం రూరల్, గుంతకల్లు, కాకినాడ సిటీ, పలమనేరు, విశాఖపట్నం ఈస్ట్, మాచర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయ దుర్గం, మదనపల్లె, పోలవరం (ఎస్టీ), కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట (ఎస్సీ), శ్రీకాళహస్తి , ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు , గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, గూడూరు (ఎస్సీ), ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి నియోజక వర్గాలు జనాభా లెక్కల మేరకు మహిళలకు కేటాయించటం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం.. నియోజవర్గాల పునర్విభజన తరువాత మార్పులు- చేర్పులకు అనుగుణంగా తుది జాబితా ఖరారు కానుంది.
Tags: Here is the list of constituencies in Andhra Pradesh (AP) that will be allocated to women by 2029—including changes to the seats held by key ministers!