కరీంనగర్ ముచ్చట్లు:
నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసు లు లాఠీచార్జి చేయ టాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తం గా విద్యాసంస్థల బంద్ చేపట్టాయి, వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి ఈ బంద్ చేపట్టినట్లు స్పష్టం చేశాయి…
దీనిలో భాగంగా విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు. విద్యాసంస్థల బంధు పిలుపుతో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు.నగరంలోని ప్రధాన కూడళ్ళు, కళాశాలల ముందు పోలీసులు భారీగా మోహరించారు.
ప్రైవేట్ కళాశాలలు స్వచ్ఛందంగా బంధు పాటించగా, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం, విద్యార్థులు హాజర య్యారు. నగరంలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిం చిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం.సిబ్బందికి తగిన సూచనలు చేశారు.ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Tags:Heavy police security!