గద్వాల ముచ్చట్లు:
- సభ్యసమాజం తలదించుకునే ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మద్యం మత్తులో కన్నకూతురిపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు తల్లికి మొరపెట్టుకోవడంతో ఈ దారుణం వెలుగుచూసింది. తల్లి ఫిర్యాదు మేరకు గద్వాల పోలీసులు తండ్రిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని గురువారం జిల్లా కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
Tags: Sexual harassment of daughter… POCSO case against father.