ములకలచెరువు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గుడుపల్లి గ్రామంలో నివాసముంటూ కొమ్మిరి శ్రీవాణి కొమ్మిరి జనార్ధన మా తల్లిదండ్రులు మేము ముగ్గురము పిల్లలను ఉన్నాము మాకు తల్లికి వందనం డబ్బులు అర్హుల జాబితాలో మా పేర్లు లేవు మేము కొత్తకోట కస్తూరిబాయ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కొమ్మిరి కీర్తన, ఏడో తరగతి చదువుతున్న కొమ్మిరి మాతా శ్రీ, సోంపల్లి పంచాయతీ రెడ్డివారి పల్లి స్కూల్లో కొమ్మిరి శ్రావణీంద్ర ఐదవ తరగతి చదువుతున్నారు, కానీ మేము తల్లికి వందనం డబ్బుల అర్హుల జాబితాలో మా పేర్లు లేవు మాకు తల్లి, తండ్రి, ఇద్దరు చనిపోయారు మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాలేదు మా తాత అయిన కొమ్మిరి నాగమల్లప్ప,స్కూల్ దగ్గరికి సచివాలయం ఆఫీసర్ దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు కానీ ఏ ఆఫీసులో సమాధానం చెప్పలేదు దయవుంచి తల్లి తండ్రి లేని బిడ్డలకు సహాయం చేయాలని కలెక్టర్ గారిని నాయకులను ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇట్లు నాగమల్లప్ప మనవరాలు, మనవడు కొమ్మిరి కీర్తన కొమ్మిరి మాతా శ్రీ కొమ్మిరి శ్రావణీంద్ర.
Tags; Our names are not on the list of those eligible for ‘Thalliki Vandanam’.