పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సమీపంలోని ఐటిఐ కళాశాలలో వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ సురేష్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, సివిల్, మెకానికల్, మెకానికల్‌డీజల్, ఫ్యాషన్‌డిజైన్ కోర్సులకు పదోతరగతి, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు అర్హులన్నారు. అభ్యర్థులు ఈనెల 22వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆగస్టు 3న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సెల్‌నెంబరు:8297006849 ను సంప్రదించి, వివరాలు తెలుసుకోవాలన్నారు.
Tags; Apply for training at ITI.