July 22, 2026
Explore
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

July 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

‘ఫ్లయింగ్ బోర్డర్స్’ కన్సల్టెన్సీ నిర్వాహకులు సౌజన్య, శ్రీనివాస్ దంపతుల అరెస్ట్

దాదాపు 750 మంది నిరుద్యోగుల నుంచి రూ.11.46 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు

హైదరాబాద్‌లో నిందిత దంపతులను అదుపులోకి తీసుకున్న విజయవాడ పోలీసులు

ఐరోపా దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వల

డబ్బులు తీసుకుని ఉద్యోగాలు చూపించకుండా మోసం చేసిన నిర్వాహకులు

మాచవరం, సైబర్‌ క్రైమ్‌, సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు

కొంతకాలంగా పరారీలో ఉన్న సౌజన్య, శ్రీనివాస్ దంపతులు

నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు గుర్తింపు

కంకిపాడు ప్రాంతంలో దంపతుల పేర్లతో పలు స్థలాల కొనుగోలు

స్థలాల లావాదేవీల విలువ సుమారు రూ.1.42 కోట్లుగా గుర్తించిన పోలీసులు

మరిన్ని ఆస్తుల వివరాల కోసం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోలీసుల ఆరా

సంస్థ కార్యాలయంలో సోదాలు… ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు స్వాధీనం

ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీలో దంపతులిద్దరూ నిర్వాహకులుగా ఉన్నట్లు ఆధారాలు

నిందితుల ఆర్థిక లావాదేవీలు, విదేశీ ఉద్యోగాల నెట్‌వర్క్‌పై పోలీసుల దర్యాప్తు

Tags: Massive fraud under the guise of overseas jobs