టి.సుండుపల్లి ముచ్చట్లు:
చిన్నగొల్లపల్లి వాసుల మృతితో ఉద్రిక్తత.. రోడ్డుపై ఆందోళన
టి.సుండుపల్లి మండలం ఉప్పరపల్లి సమీపంలోని చండ్రాయుడు స్వామి ఆలయం ఎదుట బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నగొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
Tags: Two killed after being hit by a sand tipper