July 22, 2026
Explore
అనధికారిక డిప్యుటేషన్లు, పరిపాలనా ఉల్లంఘనల ఆరోపణలు

అనధికారిక డిప్యుటేషన్లు, పరిపాలనా ఉల్లంఘనల ఆరోపణలు

July 22, 2026 | Andhra Pradesh

: అల్లూరి జిల్లా డీఎంహెచ్‌వో సస్పెన్షన్

అల్లూరి సీతారామరాజు ముచ్చట్లు:

అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

అనధికారిక డిప్యుటేషన్లు, ఉద్యోగులను వేధించడం, పరిపాలనా విధానాలను ఉల్లంఘించడం, అలాగే ఇతర అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

ఈ మేరకు సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ కృష్ణమూర్తి నాయక్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Tags: Allegations of unauthorized deputations and administrative violations