July 21, 2026
Explore
పోలీసు సిబ్బందికి సీపీఆర్‌పై ప్రత్యేక అవగాహన

పోలీసు సిబ్బందికి సీపీఆర్‌పై ప్రత్యేక అవగాహన

July 21, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సీపీఆర్ విధానంపై వైద్య నిపుణుల అవగాహన.
  • వైద్య నిపుణులు పోలీసు సిబ్బందికి ప్రాక్టికల్ డెమోతో శిక్షణ.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు IAP–CPR DAY సందర్భంగా మంగళవారం ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులు, సిబ్బందికి కార్డియో పల్మనరీ రీససిటేషన్ (CPR) పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలు, గుండెపోటు, శ్వాస ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సమయానికి సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఈ సందర్భంగా వివరించారు.

ఈ కార్యక్రమానికి ఎస్‌వీఆర్‌ఆర్‌జీజీహెచ్ (రూయా ఆసుపత్రి) సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, డిప్యూటీ సూపరింటెండెంట్ & పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జున, పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సింధూర, పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ యోగేష్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.వి. నాగ దుర్గాదేవి, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొని సీపీఆర్ నిర్వహించే సరైన విధానం, ఛాతిపై ఒత్తిడి (Chest Compressions), కృత్రిమ శ్వాస (Rescue Breathing), అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించారు.

పోలీసు విధుల్లో రోడ్డు ప్రమాదాలు, ప్రజా సమూహాలు, అత్యవసర సంఘటనలు తరచుగా ఎదురవుతుంటాయని, అటువంటి సందర్భాల్లో సీపీఆర్‌పై అవగాహన, నైపుణ్యం ఉంటే ప్రాణాలను రక్షించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించగలరని వైద్య నిపుణులు తెలిపారు. ప్రతి పోలీసు సిబ్బంది ఈ ప్రాణరక్షక నైపుణ్యాన్ని అలవరచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు, శ్రీనివాసులు (పరిపాలన), శ్రీనివాసరావు(సాయుధ దళం) వారు పాల్గొన్నారు.పోలీసు సిబ్బంది సీపీఆర్ విధానాన్ని ప్రాక్టికల్‌గా అభ్యసించి, అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేందుకు అవసరమైన సూచనలు స్వీకరించారు.

Tags: Special awareness session on CPR for police personnel