ఓబులవారిపల్లి ముచ్చట్లు:
ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోట పంచాయతీ తిరుగుడుపల్లి దళితవాడలో మూడు నెలలుగా వీధిలైట్లు వెలగడం లేదని సీపీఐ నేతలు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలిపారు. ఎంపీడీవో వెంటనే చర్యలు తీసుకుని త్వరలోనే వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని సీపీఐ నాయకుడు జ్యోతి చిన్నయ్య తెలిపారు. హామీ అమలు కాకపోతే దళితులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Tags: Streetlights must be installed in the Dalit colony of Thirugudupalli: CPI