September 5, 2026
Explore
ఘనంగా గురుపూజోత్సవం

ఘనంగా గురుపూజోత్సవం

September 5, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు (డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి) అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో , మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని బిఆర్‌.అంబేద్కర్‌ భవన్‌లో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారులు నటరాజరెడ్డి, రెడ్డెన్నశెట్టి ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో గురువులు పాత్ర ఎంతో కీలకమని , సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శప్రాయులని కొనియాడారు. అనంతరం పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను శాలువలతో సన్మానించి, సత్కరించారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు రుద్రాణి, కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌లో హెచ్‌ఎం ఉషారాణి, మేలుపట్ల పాఠశాలలో హెచ్‌ఎం సుబ్రమణ్యం అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు , విద్యార్థినులకు నిర్వహించిన ఆటల పోటీలోల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ చీఫ్‌ మేనేజర్‌ భవాని, రామకృష్ణనాయక్‌, వనజ, రాజేశ్వరి, జీవలత, మునిశంకర్‌, చంద్రశేఖర్‌, శైలజ, గాయత్రితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు , ప్రధానోపాధ్యాయులు రమణ, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags; Grand Celebration of Guru Puja Utsav