September 5, 2026
Explore
బిజెపి మండల కార్యవర్గ సమావేశం

బిజెపి మండల కార్యవర్గ సమావేశం

September 5, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులినరేంద్రకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు రూరల్‌ మండల బిజెపి అధ్యక్షుడు కె.శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆరడిగుంట పంచాయతీలోని కురప్పల్లెలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహించనున్న సంకల్ప అభియాన్‌ ను మండలంలోని అన్ని పంచాయతీల్లో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల కమిటిలో ఖాళీగా ఉన్న అధ్యక్ష, కార్యదర్శి పదవులు భర్తీతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయడంపై దిశానిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో బిజేపి నాయకులు నారాయణరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, చిన్నకృష్ణప్ప, కిరణ్‌కుమార్‌, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

Tags: BJP Mandal Executive Committee Meeting