పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతిశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ టి.శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2026కు శనివారం ఎంపికైయ్యారు. గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన ఆయన జేఎన్‌యూలో పీజీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, పిహెచ్‌డి పూర్తి చేసి యూజీసీ -నెట్, జేఆర్‌ఎఫ్ సాధించారు. 13 ఏళ్లకు పైగా ఉన్న విద్యారంగంలో సేవలందిస్తున్న ఆయన ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ , వైస్ ప్రిన్సిపాల్ , ఇంటర్న్షిప్ , ప్లేస్‌మెంట్ తదితర బాధ్యతలు నిర్వహించారు. సుమారు 396 మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ , నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించారు. ఆధునిక బోధనా పద్దతులతో విద్యార్థులను పోటీ పరీక్షలు, పరిశోధన, ఉపాధి వైపు ప్రోత్సహిస్తున్నారు. ఆయనకు అవార్డు రావడం కళాశాల, విద్యార్థులు, అధ్యాపకులు, అన్నమయ్య జిల్లాకు గర్వకారణమని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్‌కె. అన్నార్ తెలిపారు.
Tags: Dr. Srinivas Named Best Teacher in the State