July 21, 2026
Explore
కరోనా రిటర్న్స్‌.. ఏపీలో 19కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య

కరోనా రిటర్న్స్‌.. ఏపీలో 19కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య

July 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరగా..,

అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి.

గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి, విశాఖ, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

తాజాగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

ఒమిక్రాన్ RF 5 వేరియంట్‌ లక్షణాలు
కరోనా ఒమిక్రాన్ RF 5 వేరియంట్‌ లక్షణాలు సాధరణంగానే ఉంటాయని.. పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట RF 5 లక్షణాలుగా తెలిపారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో RF 5 కేసులు వెలుగు చూస్తున్నాయని.. RF 5 వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags: Corona returns… COVID case count in AP reaches 19.