అమరావతిముచ్చట్లు:
ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup)ను స్పెయిన్ సొంతం చేసుకుంది.ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై 1-0తో గెలుపొంది విశ్వవిజేతగా నిలిచింది. ఇరుజట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో.. ఎక్స్ట్రా టైమ్ కేటాయించారు. ఈ క్రమంలోనే 106వ నిమిషంలో స్పెయిన్ (Spain) ఆటగాడు ఫెర్రాన్ టొర్రెస్ గోల్ కొట్టాడు.
స్పెయిన్కు ఇది రెండో ప్రపంచకప్ టైటిల్. గతంలో 2010లో ఓసారి విజేతగా నిలిచింది. గత టోర్నీలో ప్రిక్వార్టర్స్లోనే వెనుదిరిగాక, పక్కా ప్రణాళికలతో అడుగులేస్తూ 2023 నేషన్స్ లీగ్, 2024 యూరో కప్ గెలిచిన స్పెయిన్.. ఇప్పుడు ప్రపంచకపన్ను సొంతం చేసుకుంది. వరల్డ్కప్ ఛాంపియన్గా రూ.481 కోట్ల ప్రైజ్మనీ దక్కించుకుంది. రన్నరప్ అర్జెంటీనా రూ.317 కోట్లు అందుకుంది.
ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ ఆటగాళ్లు స్పష్టమైన ఆధిక్యం కనబర్చారు. బంతిని 68 శాతం తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు. గోల్పోస్ట్ వైపు 11 షాట్లు సంధించారు. అయితే.. అర్జెంటీనా గోల్కీపర్ మార్టినెజ్.. పెట్టని గోడలా మారి, ప్రత్యర్థి గోలను కట్టడి చేశాడు. మరోవైపు.. అర్జెంటీనా ప్లేయర్ ఫెర్నాండోకు 90+3 నిమిషంలో రెడ్ కార్డ్ జారీ అయ్యింది. దీంతో ఈ జట్టు 10 మంది ప్లేయర్లతోనే మిగతా ఆట కొనసాగించింది.
స్పెయిన్కు అవార్డుల పంట..
ఫైనల్లో సూపర్ గోల్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చిన ఫెర్రాన్ టొర్రెస్.. ‘సుపీరియర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. టోర్నమెంట్లో ఉత్తమ ఆటగాడికి ఇచ్చే ‘గోల్డెన్ బాల్’ అవార్డును రోడ్రీ గెలుచుకున్నాడు. 19 ఏళ్ల పావ్ క్యూబార్సీ ‘టోర్నమెంట్ యంగ్ ప్లేయర్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. గోల్ కీపర్ ఉనై సైమన్కు ‘గోల్డెన్ గ్లోవ్’ అవార్డు దక్కింది.
ప్రత్యర్థులు ఒకే ఒక్క గోల్..
ఫిఫా ప్రపంచకప్ను గెలిచే క్రమంలో.. అత్యంత తక్కువ గోల్స్ ఇచ్చిన దేశంగా స్పెయిన్ రికార్డు సృష్టించింది. టోర్నమెంట్ మొత్తంలో ప్రత్యర్థులకు కేవలం ఒకే ఒక్క గోల్ ఇచ్చింది. ఎంబాపె, మెస్సి, రొనాల్డో వంటి దిగ్గజ ఆటగాళ్లు విఫలమయ్యారు. క్వార్టర్ ఫైనల్లో బెల్జియానికి చెందిన చార్లెస్ ది కెటెలెరె ఒక్కడే స్పెయిన్పై గోల్ సాధించాడు.
‘ఫిఫా’లో సరికొత్త రికార్డు..
ఈ గెలుపుతో.. ఏకకాలంలో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచిన మొదటి దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. 2023లో స్పెయిన్ మహిళల జట్టు వరల్డ్కప్ గెలుచుకుంది. తదుపరి మహిళల ప్రపంచకప్ జరిగే 2027 వరకు ఛాంపియన్గా కొనసాగుతుంది.
Tags: Spain crowned world champions… clinches FIFA World Cup.