July 20, 2026
Explore
వందేమాతరం’ గేయాన్ని అవమానిస్తే.. మూడేళ్ల జైలు !

వందేమాతరం’ గేయాన్ని అవమానిస్తే.. మూడేళ్ల జైలు !

July 20, 2026 | Andhra Pradesh

దిల్లీ ముచ్చట్లు:

జాతీయ గేయం ‘వందేమాతరం’ని అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా ఇకపై చట్టరీత్యా నేరంగా పరిగణించనున్నారు.

ఈ మేరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజే (సోమవారం) ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ (సవరణ)-2026′ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Tags: Three years in jail for insulting the ‘Vande Mataram’ song!