July 19, 2026
Explore
చిలకలూరిపేటలో పేకాట రాయుళ్ల అరెస్టు..

చిలకలూరిపేటలో పేకాట రాయుళ్ల అరెస్టు..

July 19, 2026 | Andhra Pradesh

చిలకలూరిపేట ముచ్చట్లు:

చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక..

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి గ్రామంలోని జాతీయ రహదారి (NH-16) పక్కన ఉన్న పొలాల్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులనుచిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.​ఈ ఘటనకు సంబంధించి రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారం అందుకున్న ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుండి రూ. 13,200 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
​ఈ సందర్భంగా ఎస్ఐ జి. అనిల్ కుమార్ మాట్లాడుతూ,చిలకలూరిపేట మండల పరిధిలో ఎవరైనా సరే కోడిపందాలు,పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags; Gamblers arrested in Chilakaluripet.