లేకపోతే కూటమి ప్రభుత్వం బలికాకతప్పదు
- రాష్ట్ర అధ్యక్షుడు పులిశ్రీనివాసులు
పుంగనూరుముచ్చట్లు:
వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చాలని రాష్ట్ర అధ్యక్షుడు పులిశ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక వాల్మీకి సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలోని పలు రాష్ట్రాలలో వాల్మీకులను ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించి , రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మన రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వాల్మీకులు ఎస్టీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. 8 జిల్లాల్లో మాత్రమే బీసీలుగా ఉన్నారని తెలిపారు. ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండ రాష్ట్రం వెహోత్తం ఎస్టీలుగా ఉండేలా తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామిలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్టీలుగా గుర్తించాలని లేకపోతే వాల్మీకుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం బలికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు శేఖర్, రామకృష్ణ, జయసింహ, ఉడుంశేఖర్, దొరస్వామి, వెంకట్రమణ, శంకర, రెడ్డెప్ప, గంగాధర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags: Valmikis should be included in the ST list.