July 19, 2026
Explore
జగన్‌ 2.0 యాప్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

జగన్‌ 2.0 యాప్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

July 19, 2026 | Andhra Pradesh

తరలివచ్చిన పార్టీ శ్రేణులు

పుంగనూరుముచ్చట్లు:

తెలుగుదేశం ప్రభుత్వం రెడ్‌బుక్‌ అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన జగన్‌ 2.0 యాప్‌ను రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. పట్టణంలో ఆయన పార్టీ శ్రేణులతో కలసి యాప్‌ను విడుదల చేసి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా జగన్‌ యాప్‌ను తయారు చేయించారని తెలిపారు. సోషల్‌మీడియాలోని అన్ని వేదికలను ప్రశ్నించే గొంతులను పోలీసులను పెట్టుకుని అణచివేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలు అందరు తమ సమస్యలను , తెలుగుదేశం పార్టీ అరాచకాలను, అక్రమాలను డిజిటల్‌ బుక్‌లో పొందుపరిచేలా యాప్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల సమాచారం ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు తెలుస్తుందని తెలిపారు. ఎక్కడ చిన్న సమస్య జరిగిన తక్షణమే యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. నియోజకవర్గంలో త్వరలోనే యాప్‌ను వినియోగించుకునేందుకు క్యాడర్‌ సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, పార్టీ రాష్ట్రకార్యదర్శులు కొండవీటి నాగభూషణం, జింకా వెంకటాచలపతి, వెంకటరెడ్డి యాదవ్‌, జిల్లా యూత్‌వింగ్‌ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల ఐటివింగ్‌ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Former Minister Peddireddy launches ‘Jagan 2.0’ app.