అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్థులు గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.
డప్పుల మోతతో గాడిదలను ఊరేగింపుగా తీసుకెళ్లి, సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక నిర్వహించారు. అనంతరం గాడిద దంపతులపై నీళ్లు పోసి వర్షాలు కురవాలని ప్రార్థించారు.
గతంలో కూడా ఇలాంటి ఆచారం నిర్వహించిన తర్వాత మంచి వర్షాలు కురిశాయని, ఈసారి కూడా సమృద్ధిగా వర్షాలు పడతాయని గ్రామస్థులు విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags: Villagers organize a wedding for donkeys to bring rain.