July 18, 2026
Explore
పాము సాయంతో భర్తను హత్య చేసిన భార్య..!!

పాము సాయంతో భర్తను హత్య చేసిన భార్య..!!

July 18, 2026 | Andhra Pradesh

లఖ్‌నవూ ముచ్చట్లు:

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య తన భర్తను హత్య చేసింది. ప్రియుడితో కలిసి.. పాము సాయంతో భర్త ప్రాణాలు తీసింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌కు చెందిన అతుల్ పన్వర్, దామిని భార్యాభర్తలు. అతుల్ స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాడు. ఆ స్కూల్‌లో డ్రైవర్‌‌గా పని చేసే తుషార్ అనే వ్యక్తితో దామిని వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతుల్‌ అడ్డు తొలగించుకోవాలని, అతడి పేరు మీద ఉన్న 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు సొంతం చేసుకోవాలని దామిని, తుషార్ భావించారు.

అతుల్‌ను మర్డర్ చేయటం కోసం ఓ పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం పాములు పట్టే వారి సాయం తీసుకున్నారు. ప్లాన్‌లో భాగంగా.. దామిని పాలలో నిద్ర మాత్రలు కలిపి భర్త అతుల్‌కు ఇచ్చింది. అతుల్ ఆ పాలు తాగి స్పృహకోల్పోయాడు. అతుల్ స్పృహకోల్పోయాడని ధ్రువీకరించుకున్నాక తుషార్‌కు దామిని ఫోన్ చేసింది. తుషార్ పాములు పట్టే ఇద్దరు వ్యక్తులను అతుల్ ఇంటి దగ్గరకు తీసుకువచ్చాడు. పాములు పట్టే వ్యక్తులు ఓ పామును అతుల్ ఉన్న బెడ్‌పై వదిలారు. ఆ పాము అతుల్‌ను కాటేసింది. కొన్ని నిమిషాలకే అతడు చనిపోయాడు.

అతుల్ పాము కాటు కారణంగానే చనిపోయాడని కుటుంబసభ్యులను, పోలీసులను దామిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. దామినితో పాటు తుషార్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. వారి మొబైల్ ఫోన్‌లను తనిఖీ చేయగా.. అందులో పాముల ఫోటోలు, పాములు పట్టే వారితో మాట్లాడిన కాల్ డేటా లభించాయి. దీంతో పోలీసులు దామిని, తుషార్‌లతో పాటు వీరికి సహకరించిన పాములు పట్టే ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Tags: Wife murders husband with the help of a snake…!!