మేడ్చల్ ముచ్చట్లు:
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడలోని శంకర్‌నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 2.30 నిమిషాల సమయంలో ఓ యువతి నగ్నంగా వీధుల్లో పరుగులు తీయడం, ఆపై తెల్లవారుజామున సమీపంలోని చెరువులో శవమై తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న యువతి, అర్ధరాత్రి తన తల్లిని ఇంట్లో ఉంచి బయట నుంచి తాళం వేసి, నగ్నంగా బయటకు పరుగులు తీసి, సమీపంలోని ఆలయం నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లి, ఆపై చెరువులో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Young woman runs naked at midnight… eventually found dead in a pond.