July 18, 2026
Explore
సిలిండర్‌ తీద్దామని వెళ్లిన డెలివరీ బాయ్.. కనిపించిది చూసి పరుగో పరుగు!

సిలిండర్‌ తీద్దామని వెళ్లిన డెలివరీ బాయ్.. కనిపించిది చూసి పరుగో పరుగు!

July 18, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

అదో గ్యాస్ గోడౌన్.. సిలిండర్లన్ని కుప్పలుగా పేర్చి ఉన్నాయి.. రోజు మాదిరిగానే గ్యాస్ డెలివరీ బాయ్స్ అక్కడకు చేరుకున్నారు.. ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కరుగా గ్యాస్ సిలిండర్లో తీసుకొని డెలివరీకి వెళ్తున్నారు. ఈ క్రమంలోని సిండర్‌ తీస్తున్న ఓ యువకుడికి గుండెలు అదిరే దృశ్యం కనిపించింది. అది చూసిన యువకుడు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసి.. అక్కడి నుంచి వెనక్కి పరుగులు తీశాడు.

విశాఖ గంగవరం పోర్ట్ రోడ్లో ఉన్న గ్యాస్ గోడౌన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గ్యాస్ సిలిండర్‌లు డెలివరీ చేసేందుకు డెలివరీ భాయ్స్ ఒక్కొక్కరుగా సిలిండర్లు తీసుకొని ఆర్డర్ ప్రకారం వెళ్తున్నారు. ఇంతలో.. సిలిండర్లో తీసుకునేందుకు వెళ్లిన ఓ గ్యాస్ డెలివరీ బాయ్‌కి అక్కడ ఏదో కదిలినట్టు కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే సిలిండర్ల మధ్యన ఓ భారీ పాము కనిపించింది. వెంటనే అక్కడ మంచి గుండెలు పట్టుకొని పరుగులు తీశాడు యువకుడు. కేకలు పట్టి సహచరులను పిలిచాడు. అది గమనించిన తోటి యువకులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్.. దాన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. చాలా సేపు శ్రమించి చాకచక్యంగా సుమారు 6 అడుగుల పొడవున్న భారీ పామును పట్టుకున్నాడు. ఆ పామును రేట్‌ స్నేక్‌గా గుర్తించాడు. ఈ రాట్ స్నేక్ అనేది విషరహితమైన, అత్యంత వేగంగా పాకే పాము అని అతను తెలిపారు. దీన్ని జెర్రిపోతు, జెర్రి గుడ్డు, ఎలుకల పాము అని కూడా పిలుస్తారని తెలిపారు. అంతేకాదు దీన్ని రైతు నేస్తం అని కూడా పిలుస్తారట.

ఎందుకంటే ఈ పాము పొలాల్లోకి వచ్చే ఎలుకలను, కీటకాలను తిని పంటలను కాపాడటంలో సహాయపడుతుందట. అందుకే ఈ పామును రైతుమిత్ర అని కూడా అంటారట. ఇది మనుషులకు ఎటువంటి హాని చేయదని.. కేవలం భయపడినప్పుడు, ఆపద కలుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే అది పెద్దగా భుసలు కొడుతుందని స్నేక్ క్యాచర్ తెలిపారు. దీని తల భాగం తాచుపాములా ఉండటం వల్ల.. దీనిని చూసి జనాలు భయపడతారని స్నేక్ క్యాచర్ కిరణ్ అన్నారు. అనంతరం దాన్ని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశాడు.

Tags: A delivery boy went to pick up a cylinder… but fled the moment he saw what was there!