గుంటూరు ముచ్చట్లు:
- కృష్ణబాబు కాలనీలో ఘటన
- దాడిలో పాల్గొన్న స్థానిక టీడీపీ నాయకుడు
- సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు
- ఘటన పై ఎమ్మెల్యే మాధవి సీరియస్
గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.
ఓ ఇంటి బోరు విషయంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది.
ఒక వర్గానికి మద్దతుగా వచ్చిన హిజ్రాలు ప్రత్యర్థి వర్గానికి చెందిన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. ఈ దాడిలో పాల్గొన్నది టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే మాధవి సీరియస్ అయ్యారు.
ఆ వ్యక్తి పార్టీ సభ్యత్వాన్ని రద్దుచేసి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
నిందితులను పోలీసులు అదుపులో కి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
Tags: Woman stripped and assaulted