అమరావతిముచ్చట్లు:
పెద్ద సంఖ్యలో సంస్థను వీడుతున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు
రాజీనామాల ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు పెరిగిపోతున్నాయి. సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో తమ పదవులను వదులుకోడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఇస్రో చేపట్టిన గగన్‌యాన్, చంద్రయాన్ ప్రాజెక్టులతో పాటు ఇతర కీలక మిషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గగన్‌యాన్, ఇతర కీలక మిషన్లు లేదా ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు గ్రూప్-ఎలోని శాస్త్రీయ, సాంకేతిక సిబ్బంది నుంచి ఎలాంటి పదవీ విరమణ లేదా స్వచ్ఛంద రాజీనామాల కోసం వచ్చే అభ్యర్థనలను అంగీకరించొద్దని ఇస్రో సెంటర్ డైరెక్టర్లు, యూనిట్ హెడ్‌లను కేంద్రం ఆదేశిస్తూ ఓ మెమో జారీ చేసింది.
Tags: A series of resignations at ISRO