అమరావతిముచ్చట్లు:
గ్యాస్ సిలిండర్ల బుకింగ్, సరెండర్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేశాక మరో సిలిండర్ కోసం 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వేచి ఉండాలి.
పీఎన్‌జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్లను తప్పనిసరిగా రద్దు చేసుకోవాలి.
కొత్త కనెక్షన్ కోసం కేవైసీ, ఆధార్, పాన్ వంటి గుర్తింపు, చిరునామా రుజువులు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అవసరం.
కనెక్షన్ రద్దుకు వినియోగదారుల పుస్తకం, ఆధార్, పాన్ వంటి ధృవపత్రాలు, రాతపూర్వక దరఖాస్తు సమర్పించాలి.
Tags: New rules for gas cylinders… Centre makes major changes to regulations.