March 24, 2026
Explore
కోర్టులో గంగమ్మ వీధిలో రోడ్డు దురాక్రమణ

కోర్టులో గంగమ్మ వీధిలో రోడ్డు దురాక్రమణ

March 24, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, మదనపల్లె లోని కోర్టులో గంగమ్మ గుడి వీధిలోని కొందరు ఇళ్ల యజమానులు దారిని దురాక్రమణ చేశారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లను మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా, మురుగు నీటి కాలువల పైనే నిర్మించారు. అంతే కాకుండా ఇళ్ల ముందు ఉన్న రోడ్లను సైతం ఆక్రమించి, ఎత్తు పల్లాలుగా సిమెంట్ తో స్లాబులు పరచడం తో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నా యని తెలిపారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు.

Tags: Road Encroachment on Gangamma Street — In Court