పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నగిరివీధిలోని శ్రీసోమేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారాహిదేవి ఉత్సవాలు మూడవ రోజు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అలాగే పట్టణంలోని బస్టాండ్ వద్ద వెలసియున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాల పూజలు నిర్వహించి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేకువజామున వారాహిదేవి ఆలయంలో హోమాలు నిర్వహించి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Special prayers for Goddess Sri Varahi and Goddess Maremma.