July 17, 2026
Explore
హె ల్మెట్‌తో ప్రాణం సేఫ్‌ – కాలుమాత్రం పోయింది

హె ల్మెట్‌తో ప్రాణం సేఫ్‌ – కాలుమాత్రం పోయింది

July 17, 2026 | Andhra Pradesh

-రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి

పుంగనూరుముచ్చట్లు:

ఓ నిండు ప్రాణాన్ని హెల్మెట్‌ కాపాడింది. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలు మిగిలిన ఎడమ కాలుపాదం మాత్రం కోల్పోయిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం భగత్‌సింగ్‌కాలనీ మలుపు వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన చక్రనాద్‌(30) ద్విచక్రవాహనంలో కోర్టుకు వెళ్లేందుకు మదనపల్లెకు బైపాస్‌లో వెళ్లేందుకు పోతుండగా ఎదురుగా అతివేగంగా వస్తున్న తమిళనాడుకు చెందిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో చక్రనాద్‌ హెల్మెట్‌ ఉండటంతో తలకు ఎలాంటి దెబ్బలు తగలక ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. కానీ కాలుపాదం మాత్రం తెగిపడిపోయింది. ఈ సంఘటనను స్థానికులు గమనించి బాధితున్ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితున్ని మెరుగైన వైద్యం వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Helmet Saved My Life – But I Lost My Leg