July 17, 2026
Explore
ఎర్రకోట మూసివేత.. ఆగస్టు 15 వరకు సందర్శకులకు నో ఎంట్రీ

ఎర్రకోట మూసివేత.. ఆగస్టు 15 వరకు సందర్శకులకు నో ఎంట్రీ

July 17, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటను జులై 16 నుండి ఆగస్టు 15 వరకు, అనగా ఒక నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు భారత పురావస్తు శాఖ (ASI) ఆదేశాలు జారీ చేసింది. 2026 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ జాతీయ వేడుకలు ముగిసిన తర్వాత ఎర్రకోటను తిరిగి పర్యాటకుల సందర్శనార్థం తెరుస్తారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ప్రధాన వేదికగా నిలుస్తుంది, ఇక్కడే ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు.

Tags: Red Fort closed… No entry for visitors until August 15.