July 16, 2026
Explore
విద్యార్థి తో కల్మా చదవాలని పాఠశాల యాజమాన్యం  ఒత్తిడి

విద్యార్థి తో కల్మా చదవాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి

July 16, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హిందూ విద్యార్థి తో కల్మా చదవాలని గత రెండు రోజులనుండి పాఠశాల సిబ్బంది తీవ్ర మానసికంగా ఒత్తిడి .. సైదాబాద్‌లో ఉద్రిక్తత..!

పాతబస్తీ పరిధిలోని సైదాబాద్‌లో ఉన్న సక్సెస్ స్కూల్‌లో 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు లేదా మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరైంది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాలలోని సిబ్బంది తీరు పట్ల విద్యార్థి కన్నీరు పెడుతు ఇంటికి రావడంతో తల్లితండ్రులు గమనించి అడగగా అసలు విషయం వెలుగులోకి రావడం జరిగింది..

ఈ ఘటనపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి, ఆరోపణలు నిజమైతే పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు…!

Tags:School management pressures student to recite the Kalma.