గుంటూరు ముచ్చట్లు:
తెనాలిలో భార్య ఫోన్‌లో ఎక్కువ సమయం మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకున్న నరేంద్రబాబు..
తన భార్య సంధ్యారాణిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఈ నెల 10న మద్యం సేవించి ఇంటికి వచ్చిన నరేంద్రబాబు, భార్య పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పడంతో ఆగ్రహించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
హత్యకు ముందే భార్య తన తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి భర్త వల్ల ప్రాణభయం ఉందని తెలిపింది.
హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Husband stabs wife to death for talking too much on the phone!