సంబేపల్లె ముచ్చట్లు:
యువత భవిష్యత్తులో విజయాలు సాధించాలంటే విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా ఎంతో అవసరమని సంబేపల్లె ఎంఈఓ శ్రీనివాసులు, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దిలీప్‌కుమార్ తెలిపారు. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా బుధవారం మోడల్ స్కూల్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
వివిధ రకాల స్కిల్ టెస్టులు నిర్వహించి వారి ప్రతిభను అంచనా వేసి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, నాయకత్వం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన వంటి జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, నిరంతరం నేర్చుకుంటూ తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిరణ్‌కుమార్ రాజు, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: Special event on the occasion of World Youth Skills Day