July 15, 2026
Explore
ఫేస్ బుక్ ..ఇన్స్టాగ్రామ్.. షోషల్ మీడియా లో చాటింగ్

ఫేస్ బుక్ ..ఇన్స్టాగ్రామ్.. షోషల్ మీడియా లో చాటింగ్

July 15, 2026 | Andhra Pradesh

ఉత్తరప్రదేశ్‌ ముచ్చట్లు:

చేసేయూత్ కి హెచ్చరిక…ఐఏఎస్ అని నమ్మించి పెళ్లి చేసుకుంది కిలాడి లేడి.. నెల రోజులకే రూ.40 లక్షలకు డిమాండ్! చేసింది… చివరికి అసలు మ్యాటర్ బయట పడింది.ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాకు చెందిన సాధన అనే యువతి.. తాను ఐఏఎస్ అధికారినని ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి, బరేలీ జిల్లాకు చెందిన అభిషేక్‌ను ప్రేమ పేరుతో వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే, ఆమె భర్త కుటుంబాన్ని రూ.40 లక్షల నగదు, రూ.20 లక్షల విలువైన భూమి కోసం వేధించడం ప్రారంభించింది. డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. అనుమానం వచ్చిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో ఆమె నకిలీ ఐఏఎస్ అని తేలింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, సాధనను అరెస్ట్ చేశారు.

Tags:Chatting on Facebook, Instagram, and social media.