వర్ధన్నపేటముచ్చట్లు:
ప్రేమ వ్యవహారం నేపథ్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ (29) అనే యువకుడు హైదరాబాద్‌లోని ఒక హాస్టల్‌లో దారుణ హత్యకు గురయ్యాడు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భాస్కర్‌కు తన స్వగ్రామానికి చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే యువకుడితో వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత కూడా భాస్కర్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగుతోందనే అనుమానంతో యువతి భర్త వేధింపులకు గురిచేసినట్లు, ఈ కుటుంబ విభేదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:A love affair? Warangal youth murdered in Hyderabad!!