పుల్లంపేట ముచ్చట్లు:
పుల్లంపేట మండలం పుత్తన్నవారిపల్లె సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. మృతులను రాజంపేట మండలం గాలివారిపల్లెకు చెందిన సోంబత్తిన నారాయణ (48), లక్ష్మీదేవి (42)గా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాలను పంచనామా నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Horrific road accident near Pullampet; husband and wife killed.