July 15, 2026
Explore
టీడీపీ ఎస్సీ సెల్ నేతపై దాడి ఘటన.. నలుగురు కార్యకర్తలు సస్పెన్షన్

టీడీపీ ఎస్సీ సెల్ నేతపై దాడి ఘటన.. నలుగురు కార్యకర్తలు సస్పెన్షన్

July 15, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

తిరుపతిలో జరిగిన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నలుగురు కార్యకర్తలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, పార్టీ నేత మధుసూదన్‌నాయుడు వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది.

ఈ ఘటనలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి వెంకటరమణపై దాడి జరగగా, ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు బాధ్యులుగా ఉయ్యాల రమణ, నూకల నాగార్జున, మహ్మద్ అక్రమ్ చావడి, షేక్ కరీముల్లాలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం వారిని సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు తెలిపారు.

Tags: Attack on TDP SC Cell leader: Four party workers suspended.