మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో ఈనెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నట్లు సమాచారం. గత నెలలో వాయిదా పడిన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది.
కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు బాధ్యతలు కేటాయించగా, ఎస్పీ ధీరజ్ బందోబస్తు, వీవీఐపీ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం చీకిలబైలు గ్రామపంచాయతీలో చెరువులను పరిశీలించి, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కదిరి రోడ్డులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Tags: CM Chandrababu’s visit to Madanapalle on the 18th of this month.