July 15, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

July 15, 2026 | Andhra Pradesh

పీలేరుముచ్చట్లు:

పీలేరు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోయపాళెం వీధికి చెందిన హసీన్ తాజ్ (17) స్కూటీపై వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆమె ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తోంది.

ప్రతిరోజూ ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన తల్లి రహీమున్నిసాను స్కూటీపై ఇంటికి తీసుకువచ్చేది. మంగళవారం మధ్యాహ్నం పాత బస్టాండ్ వద్ద నిలిచి ఉన్న పీలేరు–సదుం ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో స్కూటీ అదుపుతప్పి బస్సు ముందు చక్రం కింద పడింది. తీవ్రంగా గాయపడిన హసీన్ తాజ్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ లోకేశ్ కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Student dies in road accident