July 15, 2026
Explore
రామాపురంలో ఆరుగురు జూదర్ల అరెస్టు

రామాపురంలో ఆరుగురు జూదర్ల అరెస్టు

July 15, 2026 | Andhra Pradesh

రామాపురం ముచ్చట్లు:

రామాపురం మండలంలో పోలీసులు జూదంపై దాడులు నిర్వహించి ఆరుగురు జూదర్లను అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ శివకుమార్ తన సిబ్బందితో కలిసి దూదేకులపల్లె సమీపంలోని కంపపొదల్లో దాడి నిర్వహించారు. అక్కడ జూదం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags: Six gamblers arrested in Ramapuram