మదనపల్లి ముచ్చట్లు:
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణే లక్ష్యంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. రాత్రి విధులలో ఉన్న సిబ్బందిని పోలీసు అధికారులు తనిఖీ చేసి అప్రమత్తం చేస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
దొంగతనాలను నివారించేందుకు ఏటీఎంల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేసి, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు రాత్రి వేళ ప్రయాణించే వాహనదారులతో “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా డయల్-112 కు సమాచారం అందించాలని కోరారు.
Tags: Police officers inspect