హైకోర్టు ఆదేశాలతో దిగి వచ్చిన యంత్రాంగం
- ఫలించిన యజమాని న్యాయపోరాటం
మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె ఎస్ బి ఐ కాలనీలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని అధికార యంత్రాంగం బుధవారం అధికారికంగా రీ ఓపెన్ చేశారు. గత ఏడాది నవంబర్ 11న వివిధ కారణాలతో జిల్లా వైద్య శాఖ అధికారులు ఈ ఆసుపత్రిని మూసివేయించారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం ఆసుపత్రిని రీ ఓపెన్ చేయడానికి అనుమతిస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో దిగి వచ్చిన యంత్రాంగం ఆసుపత్రి యజమాని డాక్టర్ ఆంజనేయులుతో సంబంధిత జిల్లా అధికారులు కలసి ఓపెనింగ్ ఉత్తర్వులు అందజేశారు. దీంతో బుధవారం అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య, రెండవ పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు, రెవెన్యూ అధికారులు ఆస్పత్రి యాజమాని ఆంజనేయులు సమక్షంలో రీ ఓపెన్ చేసి అనుమతి పత్రాలు యజమానికి అందజేశారు. న్యాయపోరాటం చేసి ఆసుపత్రి సేవలు తిరిగి ప్రారంభమైనట్లు యాజమాన్యం తెలిపింది.
Tags; Global Multi-Specialty Hospital Reopens in Madanapalle