July 14, 2026
Explore
ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం

ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం

July 14, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , రాష్ట్ర మాజీమంత్రి డాక్టర్‌పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి,తంబళ్లపల్లెఎమ్మెల్యే పెద్దిరెడ్డిద్వారకనాథరెడ్డిలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మరణవార్త అత్యంత బాధాకరమని పేర్కొన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ విషాద సమయంలో ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ లోటును భరించే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Tags: Condolences on the death of Mudragada Padmanabham