July 11, 2026
Explore
స్నేహవీచికలకు కేరాఫ్‌ ….లోక్‌అదాలత్‌

స్నేహవీచికలకు కేరాఫ్‌ ….లోక్‌అదాలత్‌

July 11, 2026 | Uncategorized

-794 కేసులు పరిష్కారం

  • రూ.75.60 లక్షలు పంపిణీ
  • న్యాయమూర్తి ఆరీఫాషేక్‌ వెల్లడి

పుంగనూరుముచ్చట్లు:

ప్రస్తుత సమాజంలో వైషమ్యాలను తొలగించి , ఇరివురి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని లోక్‌అదాలత్‌ ద్వారానే తీసుకురావడం సాధ్యమౌతోందని సీనియర్‌ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్‌ వెల్లడించారు. శనివారం జాతీయలోక్‌అదాలత్‌ను ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి పరేష్‌కుమార్‌, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్‌ కేసులు 46, క్రిమినల్‌ కేసులు 748 లను పరిష్కరించి, రూ.75.60 లక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆరీఫాషేక్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి లోక్‌అదాలత్‌ వేదిక కావాలన్నారు. ప్రతి ఒక్కరు తమ పరిధిలోని కక్షిదారులకు అవగాహన కల్పించి, కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. లోక్‌అదాలత్‌లో కేసులపై అప్పీల్‌ ఉండదన్నారు. స్టాంప్‌డ్యూటి తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. సత్వర పరిష్కారంతో వ్యయము, కాలము కలసివస్తుందన్నారు. లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేసిన న్యాయవాదులకు, అధికారులకు , ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసహకారం ఇలాగే కొనసాగించాలని కోరారు.

Tags: Lok Adalat — A hub for fostering friendly bonds.