July 14, 2026
Explore
వేరుశెనగ విత్తనాలకు డబ్బులతో అమరావతి కడతారా

వేరుశెనగ విత్తనాలకు డబ్బులతో అమరావతి కడతారా

July 14, 2026 | Uncategorized

మండల మీట్‌లో నిలధీసిన సభ్యులు

పుంగనూరుముచ్చట్లు:

ప్రభుత్వం వేరుశెనగ విత్తనాలు సకాలంలో పంపిణీ చేయకపోయిన రైతుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన డబ్బుతో అమరావతి కడతారా అంటు ఎంపీటీసిలు వ్యవసాయాధికారులను నిలధీసిన సంఘటన మంగళవారం జరిగింది. మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో అప్పాజి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసిలు నంజుండప్ప, నాగభూషణ్‌రెడ్డి, నాగరాజ లు ఒక్కసారిగా వ్యవసాయశాఖపై విరుచుకుపడ్డారు. విత్తనాలకు డబ్బులు చెల్లించి 25 రోజులు కావస్తున్న విత్తనాలు ఎందుకు ఇవ్వరంటు నిలధీశారు. ఎంపిపి జోక్యం చేసుకుంటు ప్రభుత్వం కావాలనే పుంగనూరుకు విత్తనాలు సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిప్రాంతాలకు విత్తనాలు పంపిణీ చేస్తున్న పుంగనూరుకు ఎందుకు ఇవ్వరని నిలధీశారు. దీనిపై ఏవో రాధ సమాధానం ఇస్తూ త్వరలోనే విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. దీనిపై ఎంపిపి మాట్లాడుతూ హామి మేరకు విత్తనాలు సరఫరా చేయకపోతే రైతులతో కలసి ఆందోళన చేస్తామని , ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను నిలధీస్తామని హెచ్చరించారు. అలాగే నీటి సమస్య ఉన్న గ్రామాల్లో సంబంధిత రైతుల బోర్ల నుంచి నీటిని సరఫరా చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాలువలు, రోడ్లు, తదితర పనులను చేసేందుకు పంచాయతీల వారిగా సమావేశాలు నిర్వహించి, చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. ఈసమావేశంలో కోఆఫ్షన్‌ మెంబరు బావాజాన్‌, వైస్‌ఎంపిపి సరోజమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags: Will you build Amaravati with money meant for groundnut seeds?