July 14, 2026
Explore
తేలప్రోలులో అనారోగ్యంతో ఉన్న గుంటక వేణుగోపాల్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా

తేలప్రోలులో అనారోగ్యంతో ఉన్న గుంటక వేణుగోపాల్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా

July 14, 2026 | Andhra Pradesh

. వల్లభనేని వంశీ

గన్నవరం ముచ్చట్లు:

ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు గుంటక వేణుగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ మంగళవారం తేలప్రోలులోని వేణుగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనను వ్యక్తిగతంగా కలిసి, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్సల వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, త్వరలోనే వేణుగోపాల్ రెడ్డి పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని కుటుంబ సభ్యులకు డా. వంశీ ధైర్యం చెప్పారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో వంశీ వెంట పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Tags; Former MLA Dr. visits ailing Guntaka Venugopal Reddy in Telaprolu