అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట్ర సీఈఓ అభ్యర్థన మేరకు సవరించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం బీఎల్ఓల ఇళ్ల సందర్శన, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను ఈ నెల (జూలై) 24 వరకు పొడిగించారు. అనంతరం జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసి, దానిపై ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 28 లోపు పరిష్కరించి, చివరగా అక్టోబర్ 3, 2026న ఏపీ ఓటర్ల తుది జాబితాను అధికారులు అధికారికంగా ప్రచురించనున్నారు.
Tags: Deadline for voter list revision in AP extended