July 14, 2026
Explore
రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం

రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం

July 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి సోషల్ మీడియా వేదికగా, ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారని, అందుకోసం భారీ స్కెచ్ వేశారంటూ ఒక వార్త నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ‘ఊరువాడ’ అనే పేరుతో ఏకంగా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో పేదలు, వెనుకబడిన వర్గాల కోసం భారీ సేవా కార్యక్రమాలు
ఈ నెల 18న తిరుపతి అభిమానులు నిర్వహిస్తున్నారు.

తారక్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఈ వార్తల పై స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాయకులు తిరివీధి హరికృష్ణ తక్షణమే స్పందించారు. ఈ ప్రచారాలన్నింటినీ వారు తీవ్రంగా ఖండించారు . ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తారక్ చేపట్టే సేవా కార్యక్రమాలు కేవలం పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమేనని.. దానికి, తారక్ పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదని స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాయకులు తిరివీధి హరికృష్ణ స్పష్టం చేశారు. ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ వార్త కేవలం పుకారు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని హరికృష్ణ స్పష్టం చేశారు…

అంతేకాదు, గతంలో కూడా కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ పేరు చెప్పి సేవా కార్యక్రమాల నెపంతో డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినప్పుడు.. తారక్ టీమ్ అప్రమత్తమై అధికారిక ప్రకటన విడుదల చేసిందని అన్నారు… కాబట్టి, తాజా ప్రచారాలను కూడా నందమూరి అభిమానులు నమ్మవద్దని, అవన్నీ ఊహాగానాలేనని తిరివీధి హరికృష్ణ తేల్చి చెప్పారు

Tags: NTR’s entry into politics… the real story.