July 14, 2026
Explore
సిటిఎం వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

సిటిఎం వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

July 14, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలంలోని సిటిఎం రేగంటివారిపల్లి రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూన్న మృత దేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళా వెంకటరమణ ఆదేశాలతో ఎస్సై చంద్రమోహన్ సిటిఎంకు సిబ్బందితో వెళ్లి మృత దేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియ రాలేదు కాగా పంచనామా అనంతరం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Tags: Unidentified person commits suicide by hanging at CTM.